మద్దతు ధర, ధాన్యం సేకరణ బాధ్యత కేంద్రానిదే

ABN , First Publish Date - 2022-03-05T06:44:31+05:30 IST

వ్యవసాయానికి పెట్టుబడి సాయం, మౌలిక వసతులు

మద్దతు ధర, ధాన్యం సేకరణ బాధ్యత కేంద్రానిదే

  •  బాయిల్డ్‌ రైస్‌ వద్దన్నందుకే ధాన్యాన్ని కొనడంలేదు: గంగుల


హైదరాబాద్‌, మార్చి 4(ఆంధ్రజ్యోతి): వ్యవసాయానికి పెట్టుబడి సాయం, మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై, మద్దతు ధరల కల్పనతో పాటు ధాన్యం సేకరణ బాఽధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కేంద్రం బాయుల్డ్‌ రైస్‌ వద్దంటున్నందుకే రాష్ట్రంలో యాసంగిలో పండిన ధాన్యాన్ని కొనలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌ హైటెక్స్‌లో ‘ముకాంబికా రైస్‌ అండ్‌ గ్రేన్‌ టెక్‌ ఎక్స్‌పో’ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌తో రైస్‌ మిల్లర్ల భేటీ ఏర్పాటుచేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 


Read more