ఇద్దరు రైతుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-25T08:26:46+05:30 IST

సిద్దిపేట జిల్లాలో గడిచిన 24గంటల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

ఇద్దరు రైతుల ఆత్మహత్య

అక్కన్నపేట, ఆగస్టు 24: సిద్దిపేట జిల్లాలో గడిచిన 24గంటల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కన్నపేట మండలం గౌరవెల్లిలో గోపగోని శ్రీకాంత్‌ (25) పురుగుల మందు తాగాడు. 10ఎకరాల కౌలు వ్యవసాయం చేస్తూ పెట్టుబడు ల కోసం రూ.30 లక్షల వరకు అప్పులు చేశాడు. దిగుబడి సరిగా రాకపోవటంతో అ ప్పులు ఎలా తీర్చాలన్న ఆదోళనతో  పురుగుల మందు తాగి మృతి చెందాడు.  దౌ ల్తాబాద్‌ మండలం దీపాంపల్లిలో నారెడ్డి రాంచంద్రారెడ్డి(40) పెట్టుబడికి తెచ్చిన అప్పులు రూ.3 లక్షలకు చేరాయి. అవి తీర్చే మార్గం కానరాక బావిలో దూకాడు.

Read more