ఆర్థిక ఇబ్బందులు తాళలేక యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-06-11T16:35:27+05:30 IST

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు

ఆర్థిక ఇబ్బందులు తాళలేక యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్/ వనస్థలిపురం: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన సంతోష్‎శర్మ(31) ఉపాధికోసం ఇరువై రోజుల క్రితం వనస్థలిపు రం పోలీస్‌ స్టేషన్‌ పరిఽధిలోని తుర్కయంజాల్‌లో కూలి పనిచేసుకుంటూ నివాసముంటున్నాడు. కొంతకాలంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు తాళలేక మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న మామిడి చెట్టుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more