రాష్ట్రస్థాయి చింతన్‌ శిబిర్‌.. భట్టి నేతృత్వంలో కమిటీ

ABN , First Publish Date - 2022-05-30T09:42:42+05:30 IST

జూన్‌ 1, 2న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి చింతన్‌ శిబిర్‌కి సీఎల్పీ నేత భట్టివిక్రమార్క చైర్మన్‌గా, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కన్వీనర్‌గా రాష్ట్రస్థాయి నవ సంకల్ప్‌ శిబిర్‌ కమిటీ ఏర్పాటైంది.

రాష్ట్రస్థాయి చింతన్‌ శిబిర్‌.. భట్టి నేతృత్వంలో కమిటీ

హైదరాబాద్‌, మే 29(ఆంధ్రజ్యోతి): జూన్‌ 1, 2న హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి చింతన్‌ శిబిర్‌కి సీఎల్పీ నేత భట్టివిక్రమార్క చైర్మన్‌గా, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కన్వీనర్‌గా రాష్ట్రస్థాయి నవ సంకల్ప్‌ శిబిర్‌ కమిటీ ఏర్పాటైంది. ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, పోదెం వీరయ్య, సీతక్క, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, గీతారెడ్డి, అజారుద్దీన్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ్‌కుమార్‌ తదితర 32 మంది ముఖ్య నేతలను సభ్యులుగా నియమించారు. 

Read more