23న వ్యవసాయ డిప్లొమా కోర్సులకు స్పాట్‌ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2022-09-21T13:15:59+05:30 IST

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ డిప్లొమా కోర్సుల్లో మిగిలిన సీట్ల కోసం స్పాట్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల

23న వ్యవసాయ డిప్లొమా కోర్సులకు స్పాట్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్/రాజేంద్రనగర్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ డిప్లొమా కోర్సుల్లో మిగిలిన సీట్ల కోసం స్పాట్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌.సుధీర్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగే కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌తో పాటు నిర్ణీత ఫీజు తీసుకొని రావాల్సి ఉంటుందన్నారు. వివరాల కోసం వర్శిటీ వెబ్‌సైట్‌ ఠీఠీఠీ.ఞ్జ్టట్చఠ.్ఛఛీఠ.జీుఽ లో చూడవచ్చన్నారు. 

Read more