టీఆర్‌ఎస్‌లో చేరిన టీపీసీసీ అధికార ప్రతినిధి

ABN , First Publish Date - 2022-10-05T09:56:42+05:30 IST

టీపీసీసీ అధికార ప్రతినిధి, తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశం గౌడ్‌టీఆర్‌ఎస్‌లో చేరారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన టీపీసీసీ అధికార ప్రతినిధి

హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధికార ప్రతినిధి, తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశం గౌడ్‌టీఆర్‌ఎస్‌లో చేరారు. మంగళవారం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఆయ న్ను గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. రాష్ట్రాభివృద్ధికి టీఆర్‌ఎస్‌ చేస్తున్న కృషి, సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని వెంకటేశం గౌడ్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు. 

Read more