సికింద్రాబాద్‌-వెలంకణ్ణి మార్గంలో ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2022-08-28T12:56:13+05:30 IST

యాత్రికుల సౌకర్యార్థం సికింద్రాబాద్‌-వెల్లంకణ్ణి-సికింద్రాబాద్‌ మార్గంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే

సికింద్రాబాద్‌-వెలంకణ్ణి మార్గంలో ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్/సికింద్రాబాద్‌: యాత్రికుల సౌకర్యార్థం సికింద్రాబాద్‌-వెల్లంకణ్ణి-సికింద్రాబాద్‌ మార్గంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌-వెల్లంకణ్ణి స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌:07161) సికింద్రాబాద్‌ నుంచి వచ్చే నెల 4వ తేదీ ఉదయం 8 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 8.30గంటలకు వె లంకణ్ణి చేరుతుంది. వెలంకణ్ణి-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07162) వెలంకణ్ణి నుంచి వచ్చే నెల 5వ తేదీ రాత్రి 11.50గంటలకు బయల్దేరి రెండో రోజు ఉదయం 3.55గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.

Read more