Secunderabad-Tirupati మధ్య ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2022-08-31T15:59:43+05:30 IST

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వికారాబాద్‌, గుంతకల్‌ మీదుగా సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు

Secunderabad-Tirupati మధ్య ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్/సికింద్రాబాద్‌: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వికారాబాద్‌, గుంతకల్‌ మీదుగా సికింద్రాబాద్‌-తిరుపతి(Secunderabad-Tirupati) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌-తిరుపతి (రైల్‌ నెంబర్‌: 07120) ఆగస్టు 31న సాయంత్రం 6.15గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 8.45గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుపతి-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07121) తిరుపతి నుంచి సెప్టెంబర్‌ 1న రాత్రి 9.10గంటలకు బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 9.30గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. 

నిర్వహణ పనుల కారణంగా కొన్ని  రైళ్ల రద్దు 

 సికింద్రాబాద్‌-రాయ్‌పూర్‌ (రైల్‌ నెంబర్‌: 12771) రైలు ఆగస్టు 31, సెప్టెంబర్‌ 2వ తేదీల్లో రద్దు ఫ రాయ్‌పూర్‌-సికింద్రాబాద్‌ (రైల్‌ నెంబర్‌: 12772) రైలు సెప్టెంబర్‌ 1, 3వ తేదీల్లో రద్దు

 హైదరాబాద్‌-గోరక్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (రైల్‌ నెంబర్‌: 02575)ను సెప్టెంబర్‌ 2, 9, 16, 23, 30, అక్టోబర్‌ 7వ తేదీల్లో గోమ్తినగర్‌ వరకు నడుపుతారు.

 గోరక్‌పూర్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెంబర్‌: 02576) రైలు సెప్టెంబర్‌ 4, 11, 18, 25, అక్టోబర్‌ 2వ తేదీ వరకు గోమ్తినగర్‌ నుంచి బయల్దేరుతుంది.

Updated Date - 2022-08-31T15:59:43+05:30 IST