హతియా-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైలు

ABN , First Publish Date - 2022-06-07T12:35:41+05:30 IST

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం హతియా-సికింద్రాబాద్‌-హతియా మార్గంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ

హతియా-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైలు

సికింద్రాబాద్‌: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ  పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం హతియా-సికింద్రాబాద్‌-హతియా మార్గంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. హతియా-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 08615) హతియా నుంచి జూన్‌ 10న రాత్రి 11.55గంటలకు బయల్దేరి, మరుసటిరోజు ఉదయం 11.30గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌-హతియా స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 08616) సికింద్రాబాద్‌ నుంచి జూన్‌ 13న రాత్రి 7.30గంటలకు బయల్దేరి, బుధవారం ఉదయం 6గంటలకు హతియా చేరుతుంది. 

Updated Date - 2022-06-07T12:35:41+05:30 IST