ఓసీపీ భూనిర్వాసితులకు త్వరలోనే పరిహారం

ABN , First Publish Date - 2022-08-31T05:32:34+05:30 IST

ఓసీపీ భూనిర్వాసితులకు త్వరలోనే పరిహారం

ఓసీపీ భూనిర్వాసితులకు త్వరలోనే పరిహారం

ఎమ్మెల్యే గండ్ర వెంకటరణమారెడ్డి

కృష్ణకాలనీ, ఆగస్టు 30: భూపాలపల్లి పట్టణంలోని ఫక్కీర్‌గడ్డలోని ఓపెన్‌కాస్ట్‌లో భూములు కోల్పోయిన రైతులకు త్వరలోనే తానే దగ్గరుండి  పరిహారం ఇప్పిస్తాన ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హామీ ఇచ్చారు. బాధిత రైతులు ఎమ్మెల్యేను మంగళవారం కలిశారు. దీంతో ఆయన సింగరేణి అధికారులతో ఫోన్‌లో మాట్లాడా రు. ఫక్కీర్‌గడ్డకు సంబంధించిన ఓసీపీ భూ నిర్వాసితులు నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారని, త్వరలోనే సమస్య పరిష్కరిచాలని కోరారు. దీనిపై సింగరేణి అధికా రులు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే భూ నిర్వాసితులకు పరిహారం అం దేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. దీంతో రైతులు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయ కులు బుర్ర రమే ష్‌, కౌన్సిలర్‌ ఆకు దారి మమత, దా ర పూలమ్మ, రాజ మల్లు, ఆముదాల రాంచందర్‌, భీమ నపల్లి మహేంద ర్‌, ఇస్లావత్‌ తిరుపతి నాయక్‌, సెగ్గం శంకర్‌,   బుర్ర కుమారస్వామి, రాజారాం, సిద్దురాల మల్లన్న, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.


Read more