తెలంగాణ ప్రభుత్వ పథకాలు భేష్: సిక్కిం మంత్రి లోక్ నాధ్ శర్మ

ABN , First Publish Date - 2022-02-19T20:17:49+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు అద్భుతంగా ఉన్నాయని సిక్కిం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి లోక్ నాధ్ శర్మ ప్రశంసించారు

తెలంగాణ ప్రభుత్వ పథకాలు భేష్: సిక్కిం మంత్రి లోక్ నాధ్ శర్మ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు అద్భుతంగా ఉన్నాయని సిక్కిం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి లోక్ నాధ్ శర్మ ప్రశంసించారు. శనివారం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఇరు రాష్ట్రాల్లో తమ శాఖలకు సంబంధించి అమలు జరుగుతున్న వివిధ పథకాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు స్పూర్తిగా వున్నాయని లోక్ నాధ్ శర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసానిపశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. 


రాష్ట్రంలో పాడి రైతులకు తెలంగాణా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం అద్బుతంగా ఉన్నాయని,తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు తనకు బాగా నచ్చాయని లోక్ నాధ్ శర్మ పేర్కొన్నారు. ఇక్కడ అమలు జరుగుతున్న పలు పథకాలు తమ రాష్ట్రంలో కూడా అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తామని అన్నారు.సిక్కిం రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాల అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరం ఉందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర పర్యటనలో తాను అనేక విషయాలు తెలుసుకొన్నాను.తెలంగాణా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో ఆర్ధికంగా ఎంతో అభివృద్దిని సాధిస్తుంది. కృత్రిమ గర్బధారణ కార్యక్రమం వలన మేలుజాతి పశుసంపద ఉత్పత్తి జరుగుతుంది. ఇది పాడి రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని లోక్ నాధ్ శర్మ అభిప్రాయపడ్డారు. 

Read more