హైదరాబాద్‌లో తొలి స్టోర్ కమ్ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాన్ని ప్రారంభించిన సిద్స్‌ ఫార్మ్

ABN , First Publish Date - 2022-10-03T23:54:42+05:30 IST

తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీమియం డీ2సీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్ తమ మొట్టమొదటి ఎక్స్‌పీరియన్స్‌

హైదరాబాద్‌లో తొలి స్టోర్ కమ్ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాన్ని ప్రారంభించిన సిద్స్‌ ఫార్మ్

హైదరాబాద్: తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీమియం డీ2సీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్ తమ మొట్టమొదటి స్టోర్ కమ్ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాన్ని నగరంలో ప్రారంభించింది. డీఆర్‌డీఓలో అదనపు చీఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఇంజినీర్‌ షేక్‌‌గౌస్‌ మోహిద్దీన్‌ సమక్షంలో దీనిని ప్రారంభించారు. ఈ వాణిజ్య కేంద్రం వినియోగదారులకు కొనుగోలు అవకాశాలను అందించడంతో పాటు సిద్స్‌ ఫార్మ్‌ అత్యున్నత నాణ్యత, ఆరోగ్యవంతమైన, స్వచ్ఛమైన ఉత్పత్తులను స్టోర్‌లో ఆస్వాదించవచ్చు. కంచన్‌భాగ్‌లోని డీఆర్‌డీఓ టౌన్‌షిప్‌ లోపల ఉన్న ఈ స్టోర్‌ ద్వారా టౌన్‌షిప్‌లోని 2 వేల మందికి ప్రయోజనం కలగనుంది. ఇక్కడ నాన్ ప్యాకేజ్డ్ ఉత్పత్తులు కూడా లభిస్తాయి. 


స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా  సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ కిశోర్ ఇందుకూరి మాట్లాడుతూ.. 15 వేలమందికి పైగా వినియోగదారులకు తాము ప్రతి రోజు వారి ఇంటి ముంగటికే సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. వినియోగదారులను తమ ఫార్మ్, ప్లాంట్, లేబరేటరీలను శనివారాల్లో సందర్శించాల్సిందిగా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. స్వచ్ఛమైన, యాంటీబయాటిక్స్‌, హార్మోన్లు, నిల్వకారకాలు లేని పాలు, పాల ఉత్పత్తులను అందించడంలో తమ ప్రయత్నాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. మున్ముందు నగరమంతా ఈ తరహా స్టోర్లను  ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు.

Read more