Dare To Dream: ‘డేర్ టు డ్రీమ్’ అవార్డు గెలుచుకున్న సిద్స్‌ ఫార్మ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి

ABN , First Publish Date - 2022-11-24T21:22:23+05:30 IST

సిద్స్ ఫార్మ్ వ్యవస్థాపకుడు డాక్టర్ కిశోర్ ఇందుకూరి (Kishore Indukuri) ప్రతిష్ఠాత్మక ‘డేర్ టు డ్రీమ్’ యంగ్ లీడర్ అవార్డును అందుకున్నారు. సి

Dare To Dream: ‘డేర్ టు డ్రీమ్’ అవార్డు గెలుచుకున్న సిద్స్‌ ఫార్మ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి
Sids Farm

ముంబై: సిద్స్ ఫార్మ్ వ్యవస్థాపకుడు డాక్టర్ కిశోర్ ఇందుకూరి (Kishore Indukuri) ప్రతిష్ఠాత్మక ‘డేర్ టు డ్రీమ్’ అవార్డులలో భాగంగా యంగ్ లీడర్ అవార్డును అందుకున్నారు. సిద్స్ ఫార్మ్ (Sids Farm) తెలంగాణ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రీమియం డీ2సీ డెయిరీ బ్రాండ్ అయిన దీనికి డాక్టర్ కిశోర్ ఇందుకూరి ఎండీగా ఉన్నారు. అవార్డు అందుకున్న అనంతరం డాక్టర్ కిశోర్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక గ్రోత్‌ మ్యాటర్స్‌ ఫోరమ్‌ నుంచి యంగ్‌ లీడర్‌ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. పాల ఉత్పత్తులను నాణ్యంగా అందించడంతో పాటు డెయిరీ ఫార్మింగ్‌ను సాంకేతికత ఆధారితంగా చేయాలనే తన కలకు అనుగుణంగా అడుగులు వేసినట్టు చెప్పారు. ఈ అవార్డులు తమలో ఆత్మవిశ్వాసం నింపడంతో పాటుగా సరైన మార్గంలో వెళ్తున్నామనే నమ్మకం కలిగించిందన్నారు.

ఆన్‌లైన్ కమ్యూనిటీ గ్రోత్ మ్యాటర్స్ ఫోరమ్ ‘డేర్ టు డ్రీమ్’ను ఏర్పాటు చేసింది. తమ వ్యాపార, పరిశ్రమల విభాగాలలోని వ్యక్తులను కలుసుకునేందుకు వ్యాపార యజమానుల కోసం ప్రత్యేకంగా దీనిని తీర్చిదిద్దారు. డేర్‌ టు డ్రీమ్‌ అవార్డును 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ఎస్‌ఎంఈలు, వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేశారు. ముంబైలోని హోటల్‌ తాజ్‌ల్యాండ్‌ ఎండ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు.

Updated Date - 2022-11-24T21:22:29+05:30 IST