సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-01-03T16:33:10+05:30 IST

సంఘం కార్యక్రమాలతో పాటు సామాజిక సేవాకార్య క్రమాలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేపట్టాలని ఎస్సై రాంచరణ్‌ అన్నారు.

సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలి

నర్సంపేట, జనవరి 2 : సంఘం కార్యక్రమాలతో పాటు సామాజిక సేవాకార్య క్రమాలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో చేపట్టాలని ఎస్సై రాంచరణ్‌ అన్నారు. పట్టణంలోని పద్మశాలి గార్డెన్‌ ఆవరనలో ఆదివారం సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పట్టణ సంఘం అధ్యక్షుడు రుద్ర ఓంప్రకాశ్‌, జిల్లా అద్యక్షుడు బాల్నె సర్వేశం, మండల సంఘం అద్యక్షుడు కుసుమ భ ద్రయ్య. పొదుపు సంఘాల కన్వినర్‌ నామాల సత్యనారయణ, కూచన శ్రీనివాసరావు, శ్రీరాముల శంకరయ్య. గడ్డం రాజేందర్‌, కామని రవీందర్‌, కోటేశ్వర్‌, వెలుదండి స్వరూప, పర్శ శ్రీధర్‌, మేర్గు సాంబయ్య, బాల్నె జగన్‌ పాల్గొన్నారు 

Read more