కరీంనగర్‌లో బీజేపీకి షాక్?

ABN , First Publish Date - 2022-03-16T21:48:54+05:30 IST

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ చెబుతున్నారు. అంతేనా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించింది.

కరీంనగర్‌లో బీజేపీకి షాక్?

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. అంతేనా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి... తెలంగాణలో పాలనా పగ్గాలు చేపడుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం కాషాయపార్టీ రోడ్‌మ్యాప్‌ను కూడా రెడీ చేసుకుందని చెబుతున్నారు. తెలంగాణపై బీజేపీ అధిష్టానం పోకస్ పెట్టింది. ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి అమిత్‌షా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమన్వయం చేస్తున్నారు.


బీజేపీకి ఉత్తర తెలంగాణలో మంచిపట్టు ఉంది. అన్ని జిల్లాలో గ్రామ కమిటీలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా కరీంనగర్‌లో పట్టు సాధించేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా కూడా సాటింది. కరీంనగర్‌ నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ఎన్నిక కావడంతో సహజంగానే బీజేపీకి మరింత బలాన్ని ఇచ్చింది. కరీంనగర్ లోక్‌సభ నుంచి బండి సంజయ్ ఎంపీగా గెలిచారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ విజయం సాధించి.. జిల్లాలో కమలాన్ని వికసింపజేశారు.


అయితే ఇక్కడే టీఆర్‌ఎస్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బండి సంజయ్‌ని దెబ్బకొట్టేందుకు పావులు కదుపుతోంది. సంజయ్‌కి దూకుడుకు కళ్లెం వేసేందుకు కార్పొరేటర్లను టీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్‌లో చేరనున్నారు. అంతేకాకుండా మరో 10 మంది బీజేపీ కార్పొరేటర్లతో టీఆర్‌‌ఎస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇదే జరిగితే కాషాయపార్టీకి ఇబ్బందేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Read more