‘ఆలేరు’లో టీఆర్‌ఎస్‌కు షాక్‌

ABN , First Publish Date - 2022-08-21T08:48:44+05:30 IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది.

‘ఆలేరు’లో టీఆర్‌ఎస్‌కు షాక్‌

బీజేపీకి గూటికి 8 మంది సర్పంచులు

ప్రజాప్రతినిధులు, పలువురు నేతలు సైతం 

యాదాద్రి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. తుర్కపల్లి మండలంలో 8 మంది సర్పంచులు, మరో 10 మంది మండల స్థాయి నేతలు టీఆర్‌ఎ్‌సకు మూకుమ్మడిగా రాజీనామా చేసి, బీజేపీ గూటికి చేరారు. వీరంతా శనివారం బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌, తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వీరికీ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరిన వారిలో వీరారెడ్డిపల్లి సర్పంచ్‌ జక్కుల శ్రీవాణి వెంకటేశ్‌ యాదవ్‌, తుర్కపల్లి సర్పంచ్‌ పడాల వనిత శ్రీనివాస్‌, దయ్యంబండ తండా సర్పంచ్‌ మాలోతు లలిత శ్రీనివాస్‌, బిల్యతండా సర్పంచ్‌ గగులోతు జ్యోతి భాస్కర్‌ నాయక్‌, రుస్తాపూర్‌ సర్పంచ్‌ వంకరి లావణ్య నారాయణ, జేతిరాంతండా సర్పంచ్‌ నునావత్‌ లలిత దేవేందర్‌ నాయక్‌, బాబునాయక్‌ తండా సర్పంచ్‌ మాలోతు రమేశ్‌ నాయక్‌, ధర్మారం సర్పంచ్‌ మాలోతు మంగ్యనాయక్‌ ఉన్నారు. టీఆర్‌ఎ్‌సవీ నియోజకవర్గ అధ్యక్షుడు ర్యాకల రమేశ్‌ యాదవ్‌, మండల నాయకులు భూక్యా రామోజీ నాయక్‌, బానోతు శత్రునాయక్‌లూ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పడాల శ్రీనివాస్‌ ఆదివారం మునుగోడులో నిర్వహించనున్న అమిత్‌షా సభలో రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు. 

Read more