రేపు ఢిల్లీకి షర్మిల

ABN , First Publish Date - 2022-10-05T09:26:59+05:30 IST

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అవినీతి, అక్రమాలపై సీబీఐ, కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయడానికి షర్మిల 6న డిల్లీ వెళ్లనున్నారు.

రేపు ఢిల్లీకి షర్మిల

కేంద్ర పెద్దలతో భేటీ... టీఆర్‌ఎస్‌ అవినీతిపై ఫిర్యాదు

హైదరాబాద్‌, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అవినీతి, అక్రమాలపై సీబీఐ, కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయడానికి షర్మిల 6న డిల్లీ వెళ్లనున్నారు. 7న డిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆమె సమావేశమయ్యే అవకాశం ఉంది. పాదయాత్ర కొనసాగిస్తున్న షర్మిల అకస్మాత్తుగా నిలిపివేసి మరీ డిల్లీ వెళుతుండడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై గవర్నర్‌ తమిళిసైకి ఫిర్యాదు చేశారు.  కేంద్రమంత్రులను కలిసి ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

Read more