సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN , First Publish Date - 2022-07-18T06:19:41+05:30 IST

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కలెక్టర్‌ శశాంకతో సమావేశమైన కేంద్ర బృందం సభ్యులు

- దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలి

- గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే ప్రగతి సాధ్యం

- కేంద్ర బృందం సభ్యులు శైలే్‌షకుమార్‌, పుల్‌కైత్‌, నీల్‌రతన్‌ 

మహబూబాబాద్‌ టౌన్‌, జూలై 17 : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న సం క్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి దేశ ప్రగతిలో జిల్లా భాగస్వామ్యం కావాలని కేంద్రబృందం సభ్యులు డైరెక్టర్‌ ఆఫ్‌ ఆర్‌హెచ్‌ (హౌసింగ్‌) శైలే్‌షకుమార్‌, వైసీఈ (ఎన్‌ ఆర్‌ఐడీఏ) పుల్‌కైత్‌, పీవోసీడీ (ఎన్‌ఆర్‌ఈజీఏ) నీల్‌రతన్‌ కోరారు. మహబూబాబాద్‌ జిల్లాలో నాలుగురోజుల పాటు పర్యటించి ఉపాధిహామీ పనులను పరిశీలించిన కేంద్ర బృం దం సభ్యులు ఆదివారం సాయంత్రం కలెక్టర్‌ శశాంకతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగితే దేశప్రగతి సాధించినట్లేనని చెప్పారు. జాతీయ ఉపాధిహామి పధకం (ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స) పనులు, గ్రామాల్లోని అభివృద్ధి స్థితిగతులు, సీసీ రోడ్ల నిర్మాణం, నర్సరీలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామాల్లో పారిశుధ్యం, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను పర్యవేక్షించినట్లు తెలిపారు. మరిపెడ, డోర్నకల్‌ మండలాల్లోని ఆనేపురం, అబ్బాయిపాలెం, నీలికుర్తి, తోడెళ్లగూడెం, బొడ్రాయితండ, వెన్నారంలో పర్యటించామని, ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స పనులు పూర్తి స్ధాయిల్లో జరుగుతున్నాయని, రోడ్ల కనిక్టివిటి చాలా బాగుందని హర్షం వ్యక్తం చేశారు. 

జిల్లా కలెక్టర్‌ శశాంక మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి మహబూబాబాద్‌ 16 మండలాలు, 461 గ్రామ పంచాయతీలతో నూతన జిల్లాగా ఆవిర్భవించిందని, ఇం దులో ఐదు ఏజెన్సీ మండలాలు, నాలుగు మునిసిపాలిటీలున్నాయని చెప్పారు. మానుకోట పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమని, జిల్లాలో మానుకోట, డోర్నకల్‌  అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో ఉండగా, మరో మూడు నియోజకవర్గాలు పాలకుర్తి, ములుగు, ఇల్లందు నియోజకవర్గాల పరిధిలోని ఆరు మండలాలున్నాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా రోడ్లకిరువైపులా మొక్కలు నాటామని, జూన్‌ 3 నుంచి 18 వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిర్వహించామన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నట్లు కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. ఉపాఽధిహామీ పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వ్యవసాయరంగానికి సాగునీరు కోసం చెరువుల పూడికతీత, ప్లాంటేషన్‌కు ఉపాధి కూలీలను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. పల్లెలు, పట్టణాల్లో ఇంటింటికి చెత్తసేకరణకు ట్రాక్టర్లు, ట్రాలీలను వినియోగిస్తూన్నామని, పంచాయతీ కార్యదర్శుల కృషి వల్ల పల్లెలు స్వచ్ఛత వైపు పయనిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభు త్వం అందించే సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో ప్రజలు వినయోగించుకునేలా చూడాలని కేంద్ర బృందం సభ్యులు కలెకర్‌కు సూచించారు. ప్రాచీన దేవాలయలు, కాకతీయుల కాలంనాటి కట్టడాలు, జలపాతాలు, వాగులు, పచ్చని అడవులతో సుందరంగా ఉందరి జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పారు. అధికారులు రబ్బానీ, సన్యాసయ్య, దయాకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-18T06:19:41+05:30 IST