రూ.100 చెల్లించి రూ.600కు అమ్ముతున్నారు!

ABN , First Publish Date - 2022-09-08T09:16:47+05:30 IST

పట్టాభూముల్లో తవ్వుతున్న ఇసుకకు చెల్లించే ధరను తగ్గించడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

రూ.100 చెల్లించి రూ.600కు అమ్ముతున్నారు!

  • పట్టాభూముల్లో సర్కారు ఇసుక వ్యాపారంపై పిటిషన్‌ 
  • హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (ఆంధ్రజ్యోతి):  పట్టాభూముల్లో తవ్వుతున్న ఇసుకకు చెల్లించే ధరను తగ్గించడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. భూ యజమానికి క్యూబిక్‌ మీటర్‌కు రూ.100 చెల్లిస్తున్న టీఎ్‌సఎండీసీ మార్కెట్లో 600 రూపాయలకు విక్రయిస్తోందని ఏటూరునాగారానికి చెందిన ఎం.సుధీర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ యాక్ట్‌కు విరుద్ధంగా నిబంధనలు రూపొందించి.. ఽఇసుక ధర తగ్గించారని పిటిషనర్‌ పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సీవీ భాస్కర్‌ రెడ్డి ధర్మాసనం.. కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, టీఎ్‌సఎండీసీ, జిల్లా కలెక్టర్‌లకు నోటీసులు జారీచేసింది. 

Updated Date - 2022-09-08T09:16:47+05:30 IST