పిల్లల్ని చూసి అంతా కన్నీటిపర్యంతం

ABN , First Publish Date - 2022-08-31T09:22:33+05:30 IST

మాడ్గుల మండలం రాజీవ్‌గాంధీ తండాకు చెందిన మౌనిక(22) అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు.

పిల్లల్ని చూసి అంతా కన్నీటిపర్యంతం

మాడ్గుల మండలం రాజీవ్‌గాంధీ తండాకు చెందిన మౌనిక(22) అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు.  భార్య మృతిని తట్టుకోలేని ఆమె భర్త మొరావాత్‌ శ్రీనివాస్‌ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లాడు. మౌనిక చితికి నిప్పంటించేందుకు కూడా రాలేకపోయాడు. దీంతో శ్రీనివాస్‌ తండ్రి కార్య.. కోడలికి తలకొరివి పెట్టారు. మౌనికకు మూడేళ్ల మనుశ్రీ, 11 నెలల గౌతమ్‌ ఉన్నాడు. చిన్నబాబు ఇంకా అమ్మపాలు తాగుతున్నాడు. పాల కోసం పిల్లాడు ఏడవడం చూసి అక్కడున్నవారంతా కన్నీటిపర్యంతమయ్యారు. కొల్కుపల్లికి చెందిన మమత(28)కు ఇద్దరు పిల్లలు. పేర్లు వర్షిత్‌, వహాన్‌. చిన్న బాబు ఇంకా అమ్మపాలు మరవలేదు. మంచాల మండలం లింగంపల్లికి చెందిన సుష్మకు నాలుగేళ్ల కుమారుడు, రెండున్నరేళ్ల పాప ఉన్నారు. 

Read more