Hyderabad:బాలికను వేధించిన స్కూల్‌ బస్‌ డ్రైవర్‌

ABN , First Publish Date - 2022-09-29T12:52:43+05:30 IST

ప్రేమపేరుతో బాలికను వేధించి.. ఒప్పుకోకపోతే కు టుంబాన్ని చంపేస్తానని బెదిరించిన ప్రైవేట్‌ స్కూల్‌ బస్‌ డ్రైవర్‌కు ఎల్‌బీనగర్‌లోని ప్రత్యేక పోక్సో

Hyderabad:బాలికను వేధించిన స్కూల్‌ బస్‌ డ్రైవర్‌

3 ఏళ్లు జైలు, రూ.10 వేలు జరిమానా

హైదరాబాద్‌ సిటీ: ప్రేమపేరుతో బాలికను వేధించి.. ఒప్పుకోకపోతే కు టుంబాన్ని చంపేస్తానని బెదిరించిన ప్రైవేట్‌ స్కూల్‌ బస్‌ డ్రైవర్‌కు ఎల్‌బీనగర్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు 3ఏళ్ల జైలుశిక్ష రూ.10వేలు జరిమానా విధిస్తూ తీ ర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపేటకు చెందిన లక్మారపు హర్షవర్థన్‌ ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్‌ డ్రైవర్‌. బస్సులో వచ్చి పోతున్న ఓ బాలికపై కన్నేసిన డ్రై వర్‌ ప్రేమపేరుతో వేధించేవాడు. పెళ్లి చేసుకోవాలనేవాడు. అతని వేధింపులు భరించలేని బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. బాధితులు వనస్థలిపు రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి సాక్ష్యా ధారాలతో చార్జిషీట్‌ దాఖలుచేసి కోర్టులో సమర్పించారు. ప్రత్యేక పోక్సోన్యాయస్థానంలో బుధవారం కేసు విచారణకు రాగా పూర్వాపరాలు పరిశీలించిన న్యా యస్థానం 3ఏళ్ల జైలుశిక్ష రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

Updated Date - 2022-09-29T12:52:43+05:30 IST