కేసీఆర్ జాతీయ పార్టీపై సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-10-04T20:40:01+05:30 IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు (CM KCR) బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ (Satya kumar) సవాల్ విసిరారు.

కేసీఆర్ జాతీయ పార్టీపై సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు

Amaravathi : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు (CM KCR) బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ (Satya kumar) సవాల్ విసిరారు. తమ పార్టీ నుంచి ఏ ఒక్కరిని బీఆర్ఎస్‌ (BRS)లోకి లాక్కోగలిగినా ముక్కు నేలకు రాస్తానన్నారు. ఆంధ్రజ్యోతి (Andhrajyothy)లో ప్రచురితమైన ‘రేపే కేసీఆర్ జాతీయ పార్టీ’ అనే కథనంపై స్పందిస్తూ సత్య కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏపీలో ఏ ఒక్క బీజేపీ కార్యకర్తనన్నా మీరు పెట్టబోతున్న BRS (భారత బార్ & రెస్టారెంట్ సమితి) పార్టీలోకి లాక్కోగలిగితే ముక్కు నేలకు రాస్తా’’ అని సత్య కుమార్ ట్విటర్ వేదికగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ‘‘మీరు పుట్టిన కాంగ్రెస్ (Congress), పెరిగిన టీడీపీ (TDP), తోడు దొంగ వైసీపీ (YCP)తో ట్రై చేసుకోండి ఒకరో ఇద్దరో తలమాసినోళ్లు దొరక్కపోరు’’ అంటూ ట్వీట్ చేశారు. 
Read more