పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని మంత్రిని కలిసిన సర్పంచ్‌లు

ABN , First Publish Date - 2022-11-16T23:24:36+05:30 IST

గ్రామపంచాయతీలకు మంజూరీ చేయాల్సిన పెం డింగ్‌ బిల్లులను సత్వరమే చెల్లించాలంటూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును సర్పంచ్‌లు కోరారు.

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని మంత్రిని కలిసిన సర్పంచ్‌లు
రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావును కలిసి సమస్యలు వివరిస్తున్న సర్పంచ్‌లు

జడ్చర్ల, నవంబరు 16 : గ్రామపంచాయతీలకు మంజూరీ చేయాల్సిన పెం డింగ్‌ బిల్లులను సత్వరమే చెల్లించాలంటూ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును సర్పంచ్‌లు కోరారు. హైదరాబాద్‌లో మంత్రిని సర్పం చ్‌ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్‌చందర్‌, మండల అధ్యక్షుడు సుంద ర్‌ రెడ్డితో పాటు సర్పంచ్‌లు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి సమస్యలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు గ్రామపంచాయతీలకు అందక గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతోందని, ఇప్పటి వరకు చేసిన పను లకు సంబంధించిన బిల్లులు అందక సర్పంచ్‌లు, కాంట్రాక్టర్‌లు ఇబ్బందులకు గురవుతున్నామంటూ వివరించారు. ఆర్థిక సంఘం నిధులు గత ఆరునెలలుగా విడుదల కాలేదని చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంలో నిర్మించిన శ్మశానవాటిక, డంపింగ్‌యార్డులు, పల్లె ప్రకృతివనాలు, నర్సరీలకు రావాల్సిన నిధుల విడుదల అంశంలో కేంద్రం సైతం మొండివైఖరిని అవలంబి స్తున్నదన్నారు. బిల్లులు అందకపోవడంతో సర్పంచ్‌లు ఇబ్బందులకు గురవుతు న్నారని, అభివృద్ధి సైతం కుంటుపడుతోందని వివరించారు. మంత్రిని కలిసిన వారిలో సర్పంచ్‌లు రవీందర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డితో పాటు పలువురున్నారు.

Updated Date - 2022-11-16T23:24:39+05:30 IST