సర్పంచ్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2022-03-17T01:43:03+05:30 IST

నిబంధనలకు విరుద్ధంగా నిధులు వినియోగించినందుకు సంజాయిషీ ఇవ్వని సర్పంచ్‌ను ఆరు నెలలపాటు సస్పెండ్‌ చేస్తూ నల్లగొండ జిల్లా

సర్పంచ్‌ సస్పెన్షన్‌

డిండి: నిబంధనలకు విరుద్ధంగా నిధులు వినియోగించినందుకు సంజాయిషీ ఇవ్వని సర్పంచ్‌ను ఆరు నెలలపాటు సస్పెండ్‌ చేస్తూ నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. దేవరకొండ డివిజన్‌లోని డిండి మండలం కుందేలుబాయితండా సర్పంచ్‌ సపావట్‌ చాంది గ్రామపంచాయతీ నిధులు రూ.7.36లక్షలు నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసినట్లు ఉపసర్పంచ్‌ తిరుపతి ఈ నెల 2వ తేదీన జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో దేవరకొండ డివిజన్‌ పంచాయతీ అధికారి నరసింహారావు గ్రామానికి వెళ్లి విచారణ నిర్వహించి జిల్లా కలెక్టర్‌ నివేదిక ఇచ్చారు. దీంతో సర్పంచ్‌ చాందికి కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేసినప్పటికీ సంజాయిషీ ఇవ్వలేదు. దీంతో సర్పంచ్‌ను పదవి నుంచి ఆరు నెలల పాటు తాత్కాలికంగా తొలగిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీచేశారు. 

Updated Date - 2022-03-17T01:43:03+05:30 IST