ఎల్బీ స్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలు

ABN , First Publish Date - 2022-10-04T01:26:04+05:30 IST

ఎల్బీ స్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ

ఎల్బీ స్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. గౌరీ పూజలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. బతుకమ్మలు, కళాకారుల ప్రదర్శనలతో ట్యాంక్‌బండ్‌కు ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో  మహిళలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 


బతుకమ్మ వేడుకల్లో తొమ్మిదో రోజు, చివరి రోజు అయిన ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి- సోమవారం) నాడు ‘సద్దుల బతుకమ్మ’ లేదా ‘పెద్ద బతుకమ్మ’గా గౌరమ్మను ఆరాధిస్తారు.. పెద్ద పళ్ళెంలో గుమ్మడి ఆకులు, రంగులు అద్దిన గునుగు పూలు, తంగేడు, ఇతర రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. సద్దులను నైవేద్యం పెట్టి, పూజలు చేస్తారు. అనంతరం రాత్రి వరకూ ఆటపాటలతో అమ్మవారిని కొలిచి, బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.

Read more