విరాళాలు వసూలు చేస్తే చర్యలు: ఆర్టీసీ ఎండీ

ABN , First Publish Date - 2022-10-03T09:47:37+05:30 IST

పండుగల పేరిట బస్‌ డిపోలు, బస్‌ యూనిట్లలో ఉద్యోగుల నుంచి బలవంతంగా విరాళాలు వసూలు చేస్తే కఠిన చర్యలు

విరాళాలు వసూలు చేస్తే చర్యలు: ఆర్టీసీ ఎండీ

పండుగల పేరిట బస్‌ డిపోలు, బస్‌ యూనిట్లలో ఉద్యోగుల నుంచి బలవంతంగా విరాళాలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు. పండుగ వేడుకలు, అధికారులకు సన్మానం పేరిట పలు సంఘాలు, బృందాలు విరాళాలు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు అందాయన్నారు. విరాళాల వసూలును నిలువరించడంపై  కఠినంగా వ్యవహరించాలని అధికారులను అదేశించారు.

Read more