కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం లేదు: ప్రవీణ్‌కుమార్‌

ABN , First Publish Date - 2022-06-08T08:56:32+05:30 IST

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరిచిన కేసీఆర్‌ పాలనపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేదని బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం లేదు: ప్రవీణ్‌కుమార్‌

కరకగూడెం, జూన్‌ 7: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరిచిన కేసీఆర్‌ పాలనపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేదని బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ఆయన చేపట్టిన 86రోజుల బహుజన రాజ్యాధికారయాత్ర మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ముగించారు. ఈ సందర్భంగా బంగారుగూడెంలో మాట్లాడుతూ కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక భద్రాద్రి ఏజెన్సీకి వచ్చి మూడు రోజులు ఇక్కడే ఉండి పోడు రైతులకు పట్టాలు ఇస్తానని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని ఆరోపించారు. హామీలను మరిచిన కేసీఆర్‌ కుటుంబ పాలనకు తెలంగాణ ప్రజలు చర్మగీతం పడేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. మాయమాటలతో మభ్యపెడుతున్న కేసీఆర్‌ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. 

Read more