గుండెకు రోబోటిక్‌ సర్జరీ

ABN , First Publish Date - 2022-03-04T08:05:44+05:30 IST

కార్డియోథొరాసిక్‌ సర్జరీలకు యూనిపోర్టల్‌ రోబోటిక్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది అపోలో ఆస్పత్రి. ఈ ఆధునిక వైద్య విధానానికి గురువారం శ్రీకారం చుట్టింది.

గుండెకు రోబోటిక్‌ సర్జరీ

చిన్న కోతతోనే శస్త్రచికిత్స పూర్తి 

హైదరాబాద్‌ సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): కార్డియోథొరాసిక్‌ సర్జరీలకు యూనిపోర్టల్‌ రోబోటిక్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది అపోలో ఆస్పత్రి. ఈ ఆధునిక వైద్య విధానానికి గురువారం శ్రీకారం చుట్టింది. వైద్యులు.. ఇద్దరు వ్యక్తులకు ఈ సర్జరీని నిర్వహించారు. రోబోటిక్‌ మినిమయల్‌ యాక్సెస్‌ సర్జన్‌ డాక్టర్‌ మంజునాథ్‌ బాలే పర్యవేక్షణలో అపోలో ఆస్పత్రి కార్డియోథొరాసిక్‌ సర్జన్లు, స్పెయిన్‌ రోబోటిక్‌, వాట్స్‌ సర్జన్‌ డాక్టర్‌ డిగో గొంజాలెజ్‌ రావాస్‌ సర్జరీ చేశారు. ఈ విధానంలో ఛాతీపై కేవలం 3 సెం.మీ.లతో ఒకే ఒక కోతతో శస్త్ర చికిత్స నిర్వహిస్తారు. ఈ అధునాతన సర్జరీనిదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో నిర్వహించినట్లు ్ల వైద్యులు వెల్లడించారు. 2021 సెప్టెంబర్‌లో డాక్టర్‌ రావాస్‌.. స్పెయిన్‌లో ఈ ప్రక్రియను ప్రారంభించారు.


యూనిపోర్టల్‌ రోబోటిక్‌ సర్జరీని కొన్ని ఐరోపా దేశాల్లోనే మాత్రమే నిర్వహిస్తున్నారని, ఇప్పుడు ఆగ్నేయాసియాలోనే తొలిసారిగా అపోలోలో నిర్వహించామని తెలిపారు. కార్డియోథొరాసిక్‌ సర్జరీని ఇప్పుడు చిన్న కోతతోనే నిర్వహించ వచ్చని, అది కూడా రోబోటిక్‌ సర్జరీకి అవసరమైన పరికరాలను రోగి పక్కటెముల దగ్గర ఓ చిన్న కోత పెట్టడం ద్వారా లోనికి పంపిస్తామని చెప్పారు. దీని ద్వారా వైద్యులు రోగి అంతర్భాగాన్ని టీవీ మానిటర్‌పై స్పష్టంగా, పెద్దగా చూడగలుగుతారని, అనంతరం ప్రత్యేక పరికరాలతో సర్జరీ నిర్వహిస్తారని తెలిపారు. ఈ ఆధునిక విధానం వల్ల సర్జరీ తర్వాత ఇబ్బందులు, ఇన్‌ఫెక్షన్లు, ఉండవన్నారు. వర్క్‌షా్‌పలో అపోలో ఆస్పత్రుల తెలంగాణ రీజినల్‌ సీఈవో వై సుబ్రమణ్యం, కార్డియోథోరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ విజయ్‌ దీక్షిత్‌, యూనిట్‌ హెడ్‌ తేజస్వీరావు తదితరులు పాల్గొన్నారు. 

Read more