mulugu: కారు-బస్సు ఢీకొని నలుగురు దుర్మరణం

ABN , First Publish Date - 2022-02-19T15:23:16+05:30 IST

గట్టమ్మ దేవాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం

mulugu: కారు-బస్సు ఢీకొని నలుగురు దుర్మరణం

ములుగు: గట్టమ్మ దేవాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు-బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితుడిని స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన వాజేడు మండలం ధర్మారం నుంచి హనుమకొండకు వెళ్తుండగా చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతులు కంభంపాటి శ్రీనివాస్, రమేష్, సుజాత, డ్రైవర్ కల్యాణ్‎గా పోలీసులు వెల్లడించారు.

Read more