ఈ ఘనత కాంగ్రెస్ పార్టీదే:రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-09-26T01:50:59+05:30 IST

గిరిజనులకు వేలాది ఎకరాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(REVANTH REDDY) అన్నారు.

ఈ ఘనత కాంగ్రెస్ పార్టీదే:రేవంత్‌రెడ్డి

యాదాద్రి: గిరిజనులకు వేలాది ఎకరాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(REVANTH REDDY) అన్నారు. ఈ ఎనిమిదేళ్ల పాలనలో టీఆర్ఎస్, బీజేపీ(TRS BJP) గిరిజనులకు ఏమిచ్చాయని ప్రశ్నించారు. కొందరి స్వార్థం, కాంట్రాక్ట్‌ల కోసం మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందన్నారు.సర్పంచ్‌లకు నిధులు ఇవ్వనివారు.. ఎమ్మెల్యేను గెలిపిస్తే ఇస్తారా? అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.టీఆర్‌ఎస్ నాయకులు వేలాది ఎకరాలను గుంజుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వేల కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్‌పై బీజేపీ సర్కార్ ఎందుకు కేసులు పెట్టడం లేదని నిలదీశారు.మునుగోడులో గెలవకుంటే కాంగ్రెస్‌ను చంపేయాలని బీజేపీ, టీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారన్నారు.ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నపుడు రాజగోపాల్‌రెడ్డి(Rajagopal Reddy) ఏం వెలగబెట్టారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వయి స్రవంతిని గెలిపిస్తే పోడు భూముల సమస్యపై కోట్లాడి పట్టాలు ఇప్పించే బాధ్యత తమదని చెప్పారు. ఈ పార్టీ మీది... చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని రేవంత్‌రెడ్డి కోరారు.

Read more