రేవంత్‌రెడ్డి బర్త్‌డేని నేరస్థుల దినంగా జరుపుతాం

ABN , First Publish Date - 2022-02-19T07:42:15+05:30 IST

ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న టీపీసీసీ చీఫ్‌

రేవంత్‌రెడ్డి బర్త్‌డేని నేరస్థుల దినంగా జరుపుతాం

  • పీయూసీ చైర్మన్‌ జీవన్‌రెడ్డి


హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బర్త్‌డేను  నేరస్థుల దినంగా జరుపుతామని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం టీఆర్‌ఎ్‌సఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ దేవుడు కేసీఆర్‌ పుట్టిన రోజును యావత్‌ తెలంగాణ ప్రజలతోపాటు, కొందరు కాంగ్రెస్‌, బీజేపీ నేతలు కూడా తమ ఇళ్లలో జరుపుకున్నారని గుర్తు చేశారు.


ఊసరవెల్లి వంశోద్ధారకుడు రేవంత్‌రెడ్డి మాత్రం నీచంగా వ్యవహరించారని ఆరోపించారు. కుక్క లాంటి వ్యక్తి రేవంత్‌ను పీసీసీ అధ్యక్షుడిగా చేశారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆయన గాంధీభవన్‌ను బ్రాందీ భవన్‌గా మార్చారన్నారు. పోలీసుల చేతిలో లాఠీ అంత పొడవు లేని రేవంత్‌ అడ్డం పొడవు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. 


Read more