కేసీఆర్ విమానం కొనుగోలుపై రేవంత్ సెటైరికల్ ట్వీట్

ABN , First Publish Date - 2022-09-30T15:09:50+05:30 IST

సీఎం కేసీఆర్ (CM KCR) విమానం కొనుగోలుపై రేవంత్ రెడ్డి (Revanth Reddy) సెటైరికల్ ట్వీట్ (Setirical Tweet) చేశారు.

కేసీఆర్ విమానం కొనుగోలుపై రేవంత్ సెటైరికల్ ట్వీట్

Hyderabad : సీఎం కేసీఆర్ (CM KCR) విమానం కొనుగోలుపై రేవంత్ రెడ్డి (Revanth Reddy) సెటైరికల్ ట్వీట్ (Setirical Tweet) చేశారు. దేశ దిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడంటూ ట్విటర్ (Twitter) వేదికగా ఎద్దేవా చేశారు. ‘‘అమరవీరుల కుటుంబాలను కలిసింది లేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఏ నాడు పరామర్శించ లేదు. ప్రగతి భవన్ ఏసీ గదిని వీడింది లేదు... ఫాంహౌస్  దాటింది లేదు. ఇప్పుడు దేశదిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడట! ఎవనిపాలయ్యిందిరో తెలంగాణ...!!’’ అని రేవంత తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


కాగా.. సీఎం కేసీఆర్ దసరా రోజున జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ అధినేతగా దేశవ్యాప్త పర్యటనల కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేశారు. పార్టీలోని పది మంది నాయకులు ఈ విమానం కొనుగోలు కోసం విరాళాలు ఇచ్చారు. విరాళాలు ఇచ్చిన నేతల్లో ముగ్గురు ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు కాగా.. ఒకరు నల్లగొండ జిల్లా, మరొకరు కరీంనగర్‌ జిల్లాకు చెందినవారు ఉన్నట్టు సమాచారం. మరోవైపు జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఏర్పాట్లనూ కేసీఆర్‌ వేగవంతం చేశారు.

Read more