Revanth Reddy : బీజేపీకి ఆ చరిత్రతో సంబంధం లేదు

ABN , First Publish Date - 2022-09-17T18:32:57+05:30 IST

ప్టెంబర్ 17 పై చర్చ జరగాలని.. చరిత్ర కలిగిన నేతలను కూడా కొన్ని పార్టీలు దొంగతనం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Revanth Reddy : బీజేపీకి ఆ చరిత్రతో సంబంధం లేదు

Hyderabad : సెప్టెంబర్ 17 పై చర్చ జరగాలని.. చరిత్ర కలిగిన నేతలను కూడా కొన్ని పార్టీలు దొంగతనం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) పేర్కొన్నారు. సర్దార్ పటేల్ (Sardar Patel) కాంగ్రెస్ నేత అని.. 1950లో జన సంఘ్ (Jana Sangh), 1980లో బీజేపీ (BJP) పుట్టాయని గుర్తు చేశారు. దేశ స్వాతంత్య్రంలో, హైదరాబాద్ స్వాతంత్య్రంలో బీజేపీ పాత్ర లేదన్నారు. బీజేపీకి ఆ చరిత్రతో సంబంధం లేదన్నారు. బీజేపీ అందుకే చరిత్రను, నేతలను దొంగిలిస్తోందని రేవంత్ పేర్కొన్నారు.


ముస్లిం రాజుల (Muslim Kings)కు వ్యతిరేకంగా హిందువులు పోరాడినట్లు చరిత్రను వక్రీకరిస్తున్నారని రేవంత్ పేర్కొన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టడానికి సెప్టెంబర్ 17ను సాధనంగా వాడుకుంటున్నారన్నారు. మరి గుజరాత్‌ (Gujarath)లోని జునాఘడ్ (Junaghad) కూడా 1948లోనే విలీనం అయిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), హోంమంత్రి అమిత్ షా (Home Minister Amith Shah) సొంత రాష్ట్రంలోని జునాఘడ్‌లో ఎందుకు వజ్రోత్సవ విమోచన వేడుకలు చేయడం లేదని ప్రశ్నించారు. 


అధికారం కోసం తెలంగాణపై మిడతల దండులా వస్తున్నారని రేవంత్ పేర్కొన్నారు. మత కల్లోలాలు సృష్టించి ఇక్కడి పరిశ్రమలు గుజరాత్ తరలిపోవాలని బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. ఎనిమిది ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ కార్యక్రమం ఎందుకు చేయలేదన్నారు. భాగ్యలక్ష్మి టెంపుల్‌కు వెళ్లి గుండు కొట్టించుకుంటాం అని చెప్పడం సరికాదన్నారు.


ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్న తోక పార్టీ ఎంఐఎం (MIM) అని రేవంత్ విమర్శించారు. అసద్‌ను భూతంగా చూపి తెలంగాణ అక్రమించడానికి బీజేపీ చిల్లర వేషాలు వేస్తున్నారన్నారు. లగడపాటి రాజగోపాల్ (Lagadapati Rajagopal), నన్నపనేని రాజకుమారి (Nannapaneni Rajakumari) వచ్చి తెలంగాణ మేం తెచ్చినం అంటే ఎలా ఉంటుందో సెప్టెంబర్ 17 పై బీజేపీ మాట్లాడటం అలానే ఉంటుందన్నారు. చరిత్రతో బీజేపీకి సంబంధం లేదు కాబట్టే అమిత్ షా కార్యక్రమానికి ప్రజలు వెళ్లలేదని రేవంత్ పేర్కొన్నారు.

Updated Date - 2022-09-17T18:32:57+05:30 IST