వందేళ్ల వరకూ మళ్లీ ఇలాంటి యాత్ర ఉండదు: రేవంత్

ABN , First Publish Date - 2022-10-01T19:49:42+05:30 IST

భారత్ జోడో యాత్ర నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర నేతలు మీడియా సమావేశం నిర్వహించారు.

వందేళ్ల వరకూ మళ్లీ ఇలాంటి యాత్ర ఉండదు: రేవంత్

Hyderabad : భారత్ జోడో యాత్ర నేపథ్యంలో తెలంగాణ (Telangana), మహారాష్ట్ర (Maharastra) నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కాంగ్రెస్ నేత సంపత్ నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర  తెలంగాణలో దాదాపు 13 రోజులు ఉంటుందన్నారు. తెలంగాణ తర్వాత రాహుల్ పాదయాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందన్నారు. పాదయాత్రపై మహారాష్ట్ర నాయకులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ నేతలతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ, మహారాష్ట్రలో కామన్ సమస్యలు ఉన్నాయని. వాటిని ఎలా ఎక్స్పోజ్ చేయాలనే అంశంపై చర్చించామని రేవంత్ పేర్కొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ నాయకులం కలిసి కర్ణాటక వెళ్లి అక్కడి పరిస్థితులు అధ్యాయనం చేస్తామన్నారు. పాదయాత్రలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని తమ ఆరాటమన్నారు. వంద సంవత్సరాల వరకూ మళ్ళీ ఇలాంటి యాత్ర ఉండదన్నారు. ఇది దేశ భవిష్యత్తును మార్చే పాదయాత్ర అన్నారు. కనీసం 25 వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలతో మహారాష్ట్రకు రాహుల్ గాంధీని తీసుకెళ్తామని రేవంత్ తెలిపారు.

Updated Date - 2022-10-01T19:49:42+05:30 IST