ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి: టీఎన్జీవో

ABN , First Publish Date - 2022-10-08T10:28:15+05:30 IST

ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ నాన్‌-గెజిటెడ్‌ అధికారుల సంఘం ప్రతినిధులు రాష్ట్ర మంత్రి తారక రామారావుకు విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి: టీఎన్జీవో

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ నాన్‌-గెజిటెడ్‌ అధికారుల సంఘం ప్రతినిధులు రాష్ట్ర మంత్రి తారక రామారావుకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్‌, రాయకంటి ప్రతాప్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌, నగర శాఖ అధ్యక్షుడు శ్రీరామ్‌ తదితరులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. 

Read more