ఫెయిల్‌ బదులు రీ అప్పియర్‌

ABN , First Publish Date - 2022-02-16T08:27:21+05:30 IST

ఇక నుంచి ఇంటర్‌ మెమోలో ఫెయిల్‌ అనే పదం కనిపించదు. దానికి బదులు రీ-అప్పీయర్‌ అని పెట్టాలని భావిస్తున్నారు.

ఫెయిల్‌ బదులు రీ అప్పియర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఇక నుంచి ఇంటర్‌ మెమోలో ఫెయిల్‌ అనే పదం కనిపించదు. దానికి బదులు రీ-అప్పీయర్‌ అని పెట్టాలని భావిస్తున్నారు. ఫెయిల్‌ అనే పదం ద్వారా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బోర్డు భావిస్తోంది. ఈ మేరకు బోర్డు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి, ప్రభుత్వానికి సమర్పించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 


Read more