ఆర్డీఎస్‌‌ను 8 ఏళ్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాలయాపన చేసింది: బండి సంజయ్‌

ABN , First Publish Date - 2022-04-24T19:32:17+05:30 IST

ఆర్డీఎస్‌‌ను 8 ఏళ్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాలయాపన చేసింది: బండి సంజయ్‌

ఆర్డీఎస్‌‌ను 8 ఏళ్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాలయాపన చేసింది: బండి సంజయ్‌

హైదరాబాద్: నకిలీ పత్తి విత్తనాలతో రైతులను మోసం చేశారని తెలంగామ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. వరి కొనకుండా కేంద్రంపై రాష్ట్రం నిందలు వేస్తుందని విమర్శించారు. సర్పంచ్‌లను సీఎం కేసీఆర్‌ అగౌరవపరుస్తున్నారని బండి సంజయ్‌ మండిపడ్డారు. ఆరు నెలల్లోపు ఆర్డీఎస్‌ పూర్తి చేస్తామని కేంద్రం చెప్పిందని, ఆర్డీఎస్‌‌ను 8 ఏళ్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాలయాపన చేసిందని తెలిపారు. రాష్ట్రంలో చిన్నరోడ్లకు కూడా మరమ్మతులు చేయలేకపోతున్నారని, ఆర్థిక సంఘాల నిధులతో రోడ్లు, మురుగుకాల్వలను కేంద్రం నిర్మించిందని మంత్రి చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Read more