137 రుణయాప్‌లపై ఆర్బీఐ నిషేధం

ABN , First Publish Date - 2022-04-24T09:35:44+05:30 IST

రుణగ్రహీతల ఆత్మహత్యలకు కారణమవుతున్న 137 నకిలీ రుణయా్‌పల వివరాలతో కూడిన జాబితాను శనివారం విడుదల చేశారు.

137 రుణయాప్‌లపై ఆర్బీఐ నిషేధం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): రుణగ్రహీతల ఆత్మహత్యలకు కారణమవుతున్న 137 నకిలీ రుణయా్‌పల వివరాలతో కూడిన జాబితాను శనివారం విడుదల చేశారు. నకిలీ రుణయా్‌పల ఆగడాలపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని సీపీలు, ఎస్పీలకు డీజీపీ కార్యాల యం నుంచి ఆదేశాలు అందడంతో సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 137 నకిలీ యాప్‌లపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) నిఘా ఉందని పోలీసులు తెలిపారు.

Read more