దివ్యాంగులకు రేషన్‌ కార్డులు

ABN , First Publish Date - 2022-07-05T10:15:27+05:30 IST

40 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు ఎలాంటి షరతులు లేకుండా రేషన్‌ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దివ్యాంగులకు రేషన్‌ కార్డులు

 40 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు ఎలాంటి షరతులు లేకుండా రేషన్‌ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. దివ్యాంగుల కుటుంబంలో ఎంత మంది సభ్యులున్నా వారి ఆదాయ పరిమితులను మినహాయించి రేషన్‌ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. గతంలో దివ్యాంగులకు కూడా ఆదాయ పరిమితిని పరిగణనలోకి తీసుకునేవారు. ఇప్పుడా నిబంధన తొలగిస్తూ.. రేషన్‌ కార్డుల జారీలో ప్రాధాన్యం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం గమనార్హం. 

Read more