యువత క్రీడల్లో రాణించాలి

ABN , First Publish Date - 2022-04-25T05:17:13+05:30 IST

యువత క్రీడల్లో రాణించాలి

యువత క్రీడల్లో రాణించాలి
విజేతలకు బహుమతులు అందజేస్తున్న గోపాల్‌రెడ్డి

కందుకూరు, ఏప్రిల్‌ 24: గ్రామీణ ప్రాంతాల్లోని యువత క్రీడల్లో రానించాలని తిమ్మాపురం సర్పంచ్‌ గంగాపురం గోపాల్‌రెడ్డి కోరారు. నాలుగు రోజులుగా తిమ్మాపురంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. టోర్నమెంటులో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ సన్నీల్ల శ్రీరాములు, వట్నాల ఈశ్వర్‌గౌడ్‌, లక్ష్మీనర్సింహారెడ్డి, జలందర్‌రెడ్డి, శ్రీలతకుమార్‌, పవన్‌కుమార్‌, సంతోష, నరసింహ, వట్నాల శేఖర్‌గౌడ్‌, రమే్‌షగౌడ్‌, జ్ఞానేశ్వర్‌ పాల్గొన్నారు.

Read more