-
-
Home » Telangana » Rangareddy » Young woman commits suicide due to resentment-MRGS-Telangana
-
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-10-12T05:09:45+05:30 IST
మనస్తాపంతో యువతి ఆత్మహత్య

వికారాబాద్, అక్టోబరు 11: తండ్రి తను చేసే పనికి వెళ్లొద్దని చెప్పినందుకు ఓ యువతి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ మునిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. మునిసిపల్ పరిధిలోని గుడుపల్లి గ్రామానికి చెందిన తిరుమలయ్య, లక్ష్మిల కూతురు శిరీష(19) వికారాబాద్ అంబేద్కర్ కాలేజీలో పారా మెడికల్ కోర్సు పూర్తి చేసింది. ప్రస్తుతం వికారాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా శిక్షణ పొందుతోంది. మంగళవారం శిరీష తండ్రి ఆస్పత్రికి వెళ్లొద్దని చెప్పి పొలం వద్దకు వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన శిరీష మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో విచారించారు. తండ్రి తిరుమల్లయ్య ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీను తెలిపారు.