కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-06-08T05:20:04+05:30 IST

కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి
ధర్నాచేస్తున్న ఏఐటీయూసీ నాయకులు

మహేశ్వరం, జూన్‌ 7: మంఖాల్‌ పారిశ్రామికవాడలోని వైట్‌క్లిప్‌ పరిశ్రమలో అకారణంగా విధులనుంచి తొలగించిన ఇద్దరు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బి.దత్తునాయక్‌ అన్నారు. మంగళవారం ఆ పరిశ్రమ ఎదుట కార్మికులతో కలిసి ధర్నా చేశారు. కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేదంటే పోరాటానికి వెనుకాడబోమని హెచ్చరించారు. కార్మికులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం పోలీసులతో ఉద్యమాలను అణచివేస్తూ కంపెనీల యాజమాన్యాలకు కొమ్ముకాస్తోందని మండిపడ్డారు. ఈ ధర్నాలో బీకేఎంయూ నాయకులు గణేష్‌, రాజు, యాదిలాల్‌, నగేష్‌, పద్మ, శిరీష పాల్గొన్నారు.  

Read more