అన్నివర్గాల అభ్యున్నతికి కృషి

ABN , First Publish Date - 2022-07-06T05:27:47+05:30 IST

అన్నివర్గాల అభ్యున్నతికి కృషి

అన్నివర్గాల అభ్యున్నతికి కృషి
పూడూర్‌ : సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

పూడూర్‌/పరిగి/దోమ, జూలై 5 : ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మల్లేశం అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు.  గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, పెండింగ్‌ పనులు తదితర అంశాలపై సభ్యులు సభ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవన్నారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను నాటేందుకు సిద్ధం చేయాలన్నారు. జడ్పీటీసీ మేఘమాల, వైస్‌ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి, ఎంపీడీవో ఉమాదేవి, శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. 

  • విద్యతోనే అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే

విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. పరిగి మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెమొంటో, శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదవి తల్లిదండ్రులకు, గ్రామానికి పేరుప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు, ఇంగ్లీష్‌ మీడియం బోధన ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతిభావంతులకు అన్ని రకాలుగా చేయూతనందిస్తామని చెప్పారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా  ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి రూ.ఏడు వేల కోట్లను ఖర్చు చేయబోతుందన్నారు. ఒక్క పరిగి నియోజకవర్గంలో 123 పాఠశాలల్లో వంద కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి మునిసిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌, ఎంపీపీ అరవింద్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌, జడ్పీటీసీలు కె.నాగిరెడ్డి, బి.హరిప్రియ, ఎంఈవో హరిశ్చందర్‌, నాయకులు ఆర్‌.అంజనేయులు, బి.ప్రవీణ్‌రెడ్డి, ఎస్‌.భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా దోమ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి శాలువా, మెమొంటోలతో సన్మానించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి విద్యార్థిని అనూష(ఎంపీసీ సెకండియర్‌) జిల్లాస్థాయిలో, ఖాజీమ్‌(సీఈసీ సెకండియర్‌) ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్‌ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం జరుగుతుందన్నారు. జడ్పీటీసీ నాగిరెడ్డి, ప్రిన్సిపాల్‌ మంజుల, పరిగి మండల ఎంపీపీ అరవింద్‌రావు, నాయకులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T05:27:47+05:30 IST