కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-11-23T23:32:20+05:30 IST

కడుపునొప్పి తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..

కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య

శామీర్‌పేట, నవంబరు 23 : కడుపునొప్పి తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడుచింతలపల్లి మండలం ఉద్దమర్రి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి సుజాత(40)కు భర్త ఇద్దరు సంతానం. కాగా, సుజాత కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో బుధవారం ఇంట్లోని గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Updated Date - 2022-11-23T23:32:20+05:30 IST

Read more