-
-
Home » Telangana » Rangareddy » Woman commits suicide because of stomach pain-MRGS-Telangana
-
కడుపు నొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-09-20T05:26:50+05:30 IST
కడుపు నొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య

శంషాబాద్ రూరల్, సెప్టెంబరు 19: కడుపు నొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం శంషాబాద్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీధర్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బహదూర్‌గూడ గ్రామానికి చెందిన కె.మల్లమ్మ (53) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఆదివారం కటుంబసభ్యులతో కలిసి మల్లమ్మ పొలానికి వెళ్లింది. అక్కడ మరోసారి కడుపునొప్పి వచ్చింది. దీంతో మనస్తాపం చెంది ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కుమారుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.