-
-
Home » Telangana » Rangareddy » With the gift of one eye two are blessed with sight-MRGS-Telangana
-
ఒకరి నేత్రదానంతో ఇద్దరికి దృష్టి భాగ్యం
ABN , First Publish Date - 2022-07-19T05:22:19+05:30 IST
ఒకరి నేత్రదానంతో ఇద్దరికి దృష్టి భాగ్యం

ఆమనగల్లు, జూలై 18: ఒకరి నేత్రదానంతో ఇద్దరికి దృష్టిభాగ్యం కలుగుతుందని ఆమనగల్లు లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు బైరి కరుణాకర్‌రెడ్డి, జిల్లా చైర్మన్ నటరాజ్ యాదయ్య అన్నారు. అంధత్వ నివారణ కార్యక్రమాన్ని లయన్స్‌క్లబ్ ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తోందన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఆమనగల్లు లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ, రాంరెడ్డిలయన్స్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. కంటి వైద్య సహాయకుడు ఎం.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శిబిరంలో 65మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 35మందికి దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించి ఐఓఎల్ ఆపరేషన్ల నిమిత్తం ఎనుగొండ రాంరెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ మాజీ రీజియన్ చైర్మన్ చంద్రశేఖర్, పీఆర్‌వో ఎంఏ పాష, సంయుక్త కార్యదర్శి ఎంగళి బాలకృష్ణ, సభ్యులు మోహన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.