గ్రామ సమస్యలు పరిష్కరిస్తా

ABN , First Publish Date - 2022-04-25T05:05:33+05:30 IST

గ్రామ సమస్యలు పరిష్కరిస్తా

గ్రామ సమస్యలు పరిష్కరిస్తా

  • తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

బషీరాబాద్‌, ఏప్రిల్‌ 24 : గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని జీవన్గి టీఆర్‌ఎస్‌ నాయకులు కలిసి గ్రామంలో నెలకొన్న సమస్యలపై విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామాభివృద్ధి, ఇతర ఆంశలపై వారితో చర్చించారు. పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేయాలని నాయకులకు సూచించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి.. త్వరలోనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే వారితో చెప్పారు. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఇందర్‌చెడ్‌ రాజు,  పీఏసీఎస్‌ మాజీ డైరెక్టర్‌ వీరారెడ్డి, నాయకులు మునీందర్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, దస్తయ్యగౌడ్‌, రాములు, గోపాల్‌, నర్సింహులు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు.

Read more