బైక్‌ను ఢీకొన్న అడవి పంది.. ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2022-03-17T05:23:28+05:30 IST

బైక్‌ను ఢీకొన్న అడవి పంది.. ఇద్దరికి గాయాలు

బైక్‌ను ఢీకొన్న అడవి పంది.. ఇద్దరికి గాయాలు

పెద్దేముల్‌, మార్చి 16 : అడవి పంది ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో దంపతులకు గాయాలుకాగా, అదే సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడవి పంది మృతిచెందింది. ఈ ఘటన పెదే ్దముల్‌ మండలం కందనెల్లి-ఖాంజాపూర్‌ రహదారిలో బుధవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని మంబాపూర్‌ గ్రామానికి చెందిన మంతట్టి లాలప్ప, అంజమ్మ దంపతులు ద్విచక్రవాహనంపై తాండూరు నుంచి మంబాపూర్‌ వెళుతున్నారు. కందనెల్లి-ఖాంజాపూర్‌ వద్దకు రాగానే అడవి పంది వీరి బైక్‌ను ఢీకొంది. దీంతో వారు కిందపడిపోగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో వికారాబాద్‌ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు అడవి పందిని ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే మృతిచెందింది. కాగా, తీవ్ర గాయాలైన దంపతులకు తృటిలో పెను ప్రమాదం తప్పినట్లయింది.

Read more