ఘట్‌కేసర్‌ ఎంపీపీ పార్టీ మారడంపై రాద్ధాంతమెందుకు?

ABN , First Publish Date - 2022-09-13T05:30:00+05:30 IST

ఘట్‌కేసర్‌ ఎంపీపీ పార్టీ మారడంపై రాద్ధాంతమెందుకు?

ఘట్‌కేసర్‌ ఎంపీపీ పార్టీ మారడంపై రాద్ధాంతమెందుకు?

ఘట్‌కేసర్‌, సెప్టెంబరు 13 : బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులతోపాటు ఇతర పార్టీల వారిని టీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్నప్పుడు రాజీనామా చేయించి చేర్చుకోవాలనే జ్ఞానం లేదా? అని మంత్రి మల్లారెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి ప్రశ్నించారు. ఘట్‌కేసర్‌ ఎంపీపీ ఇతర పార్టీలోకి వెళ్లడంపై మంత్రి గగ్గోలు పడటం ఏంటని ఆయన ప్రశ్నించారు. మంగళవారం ఘట్‌కేసర్‌లోని శివారెడ్డిగూడ బంధన్‌ పంక్షన్‌హాల్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డబ్బులు, ప్రభుత్వ పథకాల ఆశ చూపుతూ నాయకులు, కార్యకర్తలను పార్టీలో చేర్చుకుంటున్న మంత్రి మల్లారెడ్డి ఘట్‌కేసర్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి పార్టీ మారాడని గగ్గోలు పట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అండతో విచక్షణ మరిచి టీఆర్‌ఎస్‌ నాయకులు అసభ్య పదజాలంతో దూషించడం సరికాదన్నారు. పోలీసు అధికారులు అధికార పార్టీ నాయకులకు వంత పాడటం సరికాదన్నారు. ఘట్‌కేసర్‌ ఎంపీపీని నిలదీయాలని చూస్తే జిల్లాలో, రాష్ట్రంలోనూ టీఆర్‌ఎస్‌ నాయకులను, మంత్రి మల్లారెడ్డిని నిలదీయాల్సి వస్తుందని  హెచ్చరించారు. మండ లాధ్యక్షుడు ప్రవీణ్‌రావు, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, తదితరులున్నారు.


Read more