భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం

ABN , First Publish Date - 2022-12-12T23:28:59+05:30 IST

భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నూతన కలెక్టరేట్‌ ఏర్పాటులో, తూంకుంటలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంతో భూములు కోల్పోయిన బాధితులు సోమవారం తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి నాయకత్వంలో మంత్రి నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు.

భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం
భూ నిర్వాసితులతో మాట్లాడుతున్న మంత్రి మల్లారెడ్డి

మంత్రి చామకూర మల్లారెడ్డి

శామీర్‌పేట, డిసెంబరు 12 : భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నూతన కలెక్టరేట్‌ ఏర్పాటులో, తూంకుంటలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంతో భూములు కోల్పోయిన బాధితులు సోమవారం తూంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి నాయకత్వంలో మంత్రి నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కలెక్టరేట్‌, డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల ఏర్పాటులో భూములను కోల్పొయి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు పరిహారం ఇవ్వలేదన్నారు. తాము ఎన్నోసార్లు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేసినా ప్రభుత్వం న్యాయం చేయడం లేదన్నారు. తాము కోల్పోయిన భూములకు సమానంగా లేదా మార్కెట్‌ ధర ప్రకారం నష్టపరిహారాన్ని ప్రభుత్వం నుంచి ఇప్పించి న్యాయం చేయాలని భూ నిర్వాసితులు మంత్రి మల్లారెడ్డికి మొరపెట్టుకున్నారు. ఈ విషయంపై మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఈ భూముల సమస్యలపై ఇక తాను నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతగా పరిష్కార చర్యలను తీసుకుని న్యాయం చేస్తానని భూ నిర్వాసితులకు భరోసా ఇచ్చారు.

Updated Date - 2022-12-12T23:28:59+05:30 IST

Read more